మనది రక్తసంబంధం కంటే గొప్పదైన బంధం – ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

Published on Mar 8, 2023 2:16 am IST


టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆర్ఆర్ఆర్. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది రిలీజ్ అయి ఎంత పెద్ద సంచలన విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డులకి నామినేట్ కాగా, మార్చి 13న జరుగనున్న ఆస్కార్ వేడుకల కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు అక్కడి పలువురు అభిమానులతో మాట్లాడిన ఎన్టీఆర్, ఒకింత ఎమోషనల్ అయ్యారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు రెట్టింపు ప్రేమ నాకు మీపై ఉంది. రక్తసంబంధం కంటే గొప్పది మన బంధం. మీప్రేమకు నేను దాసుడిని, మీ అందరికీ పాదాభివందనం, మరొక జన్మ అంటూ ఉంటే మీ అభిమానం కోసం మరొక్కసారి పుట్టాలని కోరుకుంటాను అంటూ ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. తమ అభిమాన హీరో నటించనున్న తదుపరి 30వ మూవీ కూడా పెద్ద సక్సెస్ అందుకుని నటుడిగా ఆయన స్థాయిని మరింతగా పెంచాలని కోరుతూ పలువురు అభిమానులు అభిలషించారు.

సంబంధిత సమాచారం :