శక్తివంతమైన మా కాంబో మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది – సందీప్ రెడ్డి వంగా

Published on Mar 3, 2023 9:57 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి అతి త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు యూనిట్. అయితే దీని తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ సినిమా చేయనుండగా, మరొక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మూవీకి కూడా పచ్చ జండా ఊపారు అల్లు అర్జున్.

భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా ఎంతో భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ నేడు ఉదయం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తామందరూ కలిసి చేస్తున్న ఈ శక్తివంతమైన కాంబో మూవీ తప్పకుండా మీ అందరి అంచనాలు అందుకుంటుందని నేడు కొద్దిసేపటి క్రితం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తీస్తున్న యానిమల్ మూవీ ఆగష్టు 11 న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :