అప్పుడు తేజ్ పై ఇప్పుడు చై సామ్ విషయంలో..ఏం మారలే

Published on Oct 3, 2021 12:00 pm IST


నిన్ననే టాలీవుడ్ జంట అక్కినేని నాగ చైతన్య మరియు సమంతా లు తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన తెలుగులో ఓ పర్టిక్యులర్ మీడియా వాళ్ళకి మాత్రం సినీ నటుల వ్యక్తిగత జీవితాల కన్నా మరొకటి ఆసక్తిగా అనిపించదు ఏమో కానీ వాస్తవానికి ఆ స్టార్స్ పక్కనే వీరు ఉన్నట్టు వాళ్ళ ఇంట్లోనే ఉండి అంతా చూసి వార్తలు ప్రచురించినట్టు చేస్తున్నారు.

అప్పుడు సాయి ధరమ్ తేజ్ విషయంలో ఎంత రచ్చ చేసారో చూసాం. బైక్ ఇలా నడిపాడు అలా నడిపాడు ఇందుకే పడిపోయాడు అని ఆ బైక్ ని చూపించి మరీ రకరకాల వార్తలు వేసుకున్నారు. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో సామ్ చైతూ ల విషయంలో కూడా మనోళ్లు అత్యుత్సాహం కనబరుస్తున్నారు.

సమంతా ఇలా ఉండలేదు అలా ఉండలేదు అని అస్సలు ఎవరికీ కలగని అనుమానాలు వీరు సృజనాత్మకతతో సృష్టించేసి టీఆర్పీ స్టంట్స్ స్టార్ట్ చేసేసారు. గత కొన్ని రోజులు కితమే ఇలాంటి వార్తలతో సినీ అభిమానులు విస్తుపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే రకంగా స్టార్ట్ చెయ్యడంతో మరింత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :