ఓవర్సీస్‌లో “అఖండ” ప్రభంజనం మామూలుగా లేదండోయ్..!

ఓవర్సీస్‌లో “అఖండ” ప్రభంజనం మామూలుగా లేదండోయ్..!

Published on Dec 4, 2021 1:01 AM IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.

అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ (500K+) డాలర్స్ మార్క్‌ని సంపాదించుకుంది. అయితే 2021లో ఒక తెలుగు సినిమాకి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ వరకూ వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం గ్యారంటీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు