ఓవర్సీస్ లో ఒకే ఒక్క చిత్రం గా “అఖండ”

Published on Dec 2, 2021 7:45 pm IST


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. ఓవర్సీస్ లో సైతం కలెక్షన్ల సునామీ సృష్టించింది అఖండ. ఓవర్సీస్ లో 2021 లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా అఖండ నిలిచింది.

ఈ విషయాన్ని ద్వారక క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా మాస్ జాతరే అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :