నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రజనీ దర్శకుడు !

Pa-Ranjith
‘అట్టకత్తి, మద్రాస్’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్ రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ చిత్రాన్ని తీసి ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందాడు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ సంచలన దర్శకుడు తన తరువాతి సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.

కానీ ఇంతలోపే ఈ దర్శకుడు తన తరువాతి సినిమాను సూర్య లేదా విజయ్ లతో తీస్తాడని ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగిపోయాయని వార్తలొచ్చాయి. కానీ రంజిత్ ఈ వార్తలను ఖండించారు. ప్రస్తుతం తానూ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నానని, అది పూర్తయ్యాకే హీరో గురించి ఆలోచిస్తానని, తాను ఇంతవరకూ ఏ హీరోని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు.