పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ కొత్త చిత్రం!

Published on Dec 2, 2021 10:03 pm IST


భిన్న కథాంశాలతో తనదైన శైలి లో కథను చెప్పే పా. రంజిత్ ఇప్పుడు మరొక సెన్సేషన్ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టారు. హీరో విక్రమ్ తో సినిమా ను నేడు ప్రకటించారు. కబాలి, కాలా చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇటీవల సార్పట్ట చిత్రం కి దర్శకత్వం వహించారు. తాజాగా విక్రమ్ తో చేసిన ప్రకటన తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రొడక్షన్ నెంబర్ 23 గా ఈ చిత్రాన్ని గ్రీన్ స్టూడియోస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చియాన్ విక్రమ్ కి ఇది 61 వ సినిమా కావడం విశేషం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :