వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి “పాగల్” సిద్ధం!

Published on Dec 2, 2021 9:35 pm IST


విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వం లో తెరకెక్కిన చట్టం పాగల్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయం సాధించింది. థియేటర్ల లో అనంతరం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిసెంబర్ 5 వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు పాగల్ చిత్రం జెమిని టీవీ లో ప్రసారం కానుంది. పాగల్ చిత్రం లో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నివేతా పేతురాజు నటించగా, సిమ్రాన్ చౌదరి మరియు మేఘ లేఖ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :