పాగల్ ఫస్ట్ వీకెండ్ కెలెక్షన్స్ రిపోర్ట్..!

Published on Aug 17, 2021 9:29 pm IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘పాగల్’. దిల్ రాజు సమర్పణలో బెక్కెమ్ వేణుగోపాల్ లక్కీ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి అంచనాల మధ్య ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు కానీ కలెక్షన్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. విశ్వక్ సేన్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చినా రెండో రోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఈ మూవీ పూర్తిగా చతికిలపడిపోయింది.

ఈ సినిమాను దిల్ రాజ్ రూ.6.3 కోట్లకు అమ్మారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.6.5 కోట్ల వరకు షేర్ రాబట్టాలి. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 2.65 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.3.9 కోట్ల సాధించాల్సి ఉంది, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగానే అనిపిస్తుంది.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం: 1.02 కోట్లు
సీడెడ్: 0.38 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.44 కోట్లు
గుంటూరు: 0.17 కోట్లు
ఈస్ట్: 0.13 కోట్లు
వెస్ట్: 0.09 కోట్లు
కృష్ణా: 0.11 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు

ఏపీ + తెలంగాణ: 2.41 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.23 కోట్లు
వరల్డ్ వైడ్: 2.64 కోట్లు

సంబంధిత సమాచారం :