
వరుణ్ సందేశ్, వితిక శేరు జంటగా మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పడ్డానండి ప్రేమలో మరి’. నల్లపాటి వంశీమోహన్ సమర్పణలో పాంచజన్య మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపై నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇటివలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’, ‘ఏమైంది ఈవేళ’ సినిమాల తరహాలో ‘పడ్డానండి ప్రేమలో మరి’ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు వరుణ్ సందేశ్. పూర్తిగా కమర్షియల్ ఫార్మటులో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, తెలంగాణ శకుంతల, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. ఎ.ఆర్.ఖుద్దూస్ సంగీతంతో పాటు సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.