పడిపడి లేచె మనసు షూటింగ్ అప్డేట్స్ !

‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ ఫెమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో యువ హీరో శర్వానంద్, ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడిపడి లేచె మనసు’. ఇటీవల నేపాల్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో శర్వానంద్, సాయి పల్లవిల ఫై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తో ఈచిత్ర షూటింగ్ పూర్తి కానుంది. అక్టోబర్ మొదటి వారంలో సినిమా టాకీ పార్ట్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 21న విడుదలచేయనున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి వైద్యురాలి పాత్రలో కనిపించనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నా ఈ చిత్రాన్ని చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version