వాయిదాపడిన భారీ బడ్జెట్ చిత్రం విడుదల !
Published on Nov 19, 2017 5:28 pm IST

ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లోనూ రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రాలు జాబితాలో హిందీ చిత్రం ‘పద్మావతి’ కూడా ఒకటి. ఆరంభం నుండి అనేక రకాలైన వివాదాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని పనులను ముగిన్చుకున్న ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 1న విడుదలచేయాలని నిర్మాతలు భావించారు.

కానీ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి ఇంకా అనుమతులు రాకపోవడంతో విడుదలను వాయిదావేశారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన వియాకామ్ 18 స్పందిస్తూ ‘మేము బాధ్యతగల పౌరులం, అన్ని చట్టాలతో పాటు సెన్సార్ బోర్డు నియమాలను కూడా గౌరవిస్తాం. అందుకే సెన్సార్ బోర్డు నుండి అనుమతులు వచ్చే వరకు సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నారు.

దీపికా పదుకొనె, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook