పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసుకున్న ‘పైసా ప‌రమాత్మ‌’ !
Published on Dec 6, 2018 1:00 pm IST

విజ‌య్ కిర‌ణ్ దర్శకత్వంలో సంకేత్‌, సుధీర్, అనూష‌, బ‌నీష ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకం పై టి.కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం `పైసా ప‌రమాత్మ‌’. ఈ చిత్రానికి కనిష్క్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ – ‘ఈ చిత్రాన్ని లేటెస్ట్ ట్రెండ్‌కి అనుగుణంగా చిత్రీక‌రించాం. మా సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం. చ‌క్క‌ని యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అందిస్తున్నాం. ప్రేక్ష‌కుల ఆశీస్సులు మాకు ఉంటాయ‌ని ఆశిస్తున్నాం` అన్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ -“అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చే చ‌క్క‌ని చిత్ర‌మిది. ఈ సినిమాకి పాట‌లు, సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. మునుముందు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మ‌రింత‌గా ఉధృతం చేస్తున్నాం. యూత్‌, ఫ్యామిలీస్ మెచ్చే ఆస‌క్తిక‌ర క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం’. అన్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook