‘ పైసా వసూల్, అర్జున్ రెడ్డి’ కృష్ణా జిల్లా కలెక్షన్లు !


నందమూరి బాలకృష్ణ నటించిన ‘పైసా వసూల్’ చిత్రం మొదటిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా బాలయ్యకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న బి, సి సెంటర్లలో బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. అన్ని ఏరియాలతో ప్లోచుకుంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమా రన్ బెటర్ గా ఉంది. 9వ రోజు శనివారం రూ.99,085, 10 వ రోజు రూ.2.92 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా రూ.1.13 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.

అలాగే విజయ్ దేవరకొండ, సందీప్ వంగల ‘అర్జుజ్ రెడ్డి’ కూడా కృష్ణా జిల్లాలో బ్రహ్మాండమైన వసూళ్లను రాబడుతోంది. గత వారం విడుదలైన ‘యుద్ధం శరణం, మేడ మీద అబ్బాయి’ వంటి సినిమాలు అంతగా ప్రభావం చూపకపోవడంతో 16వ రోజు కృష్ణాలో రూ. 1.49 లక్షలు, 17వ రోజు రూ. 2.72 లక్షలు కలిపి మొత్తంగా రూ.1. 05 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.