డబ్బింగ్ దశలో ‘పైసా వసూల్’ !
Published on Jul 16, 2017 4:16 pm IST


నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది శరవేగంగా పనుల్ని జరుపుకుంటోంది. ఒకవైపు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరోవైపు డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ మొదలుపెట్టింది.

అనౌన్స్ చేసిన రోజు నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ చిత్రంలో బాలయ్య స్టైలిష్ లుక్ తో సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆఖరి షెడ్యూల్ ఈ నెల 28 తో ముగియనుంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా బాలయ్యకు జోడీగా శ్రియ శరన్ నటిస్తోంది.

 
Like us on Facebook