పైసా వసూల్ ఆడియో లాంచ్ డేట్ వచ్చేసింది !
Published on Jul 29, 2017 6:00 pm IST


నిన్ననే విడుదల చేసిన పైసా వసూల్ టీజర్ లో బాలకృష్ణ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. సాధారణంగానే ఎనర్జీతో ఏమాత్రం తగ్గని బాలయ్య పైసా వసూల్ టీజర్ లో మంచి జోష్ తో కనిపించాడు. విలన్లపై బాలయ్య సెటైర్లు పేలుస్తూ చెప్పిన డైలాగులు అందిరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలకృష్ణ తొలిసారి పూరి దర్శకత్వంలో నటిస్తుండడంతో ఈ చిత్రం మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్ ఆ అంచనాలను ఇంకా పెంచేసింది.

చిత్ర విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. అందులో భాగంగా నిర్వహించే ఆడియో విడుదల తేదీని ఖరారైంది. పైసా వసూల్ చిత్ర ఆడియోని ఆగష్టు 13 న విడుదల చేయనున్నారు. సరైన ఆడియో విడుదల వేదిక కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, శ్రీయ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook