‘పైసా వసూల్’ కృష్ణా, గుంటూరు కలెక్షన్లు !


నందమయూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ గత శుక్రవారం విడుదలై అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లతో నడుస్తోంది. అభిమానులను, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ సినిమా మొదటిరోజు ఏపి, తెలంగాణల్లో కలిపి సుమారు రూ.7.9 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.8. 9 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఇక బాలకృష్ణకు మంచి ఫాలోయింగ్ ఉన్న కృష్ణా జిల్లాలో రెండవ రోజు రూ. 23 లక్షల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా రూ.75. 7 లక్షలు ఖాతాలో వేసుకుంది. ఇక గుంటూరులో 2వ రోజు శనివారం రూ.23.13 లక్షలు రాబట్టి రెండు రోజులకు కలిపి రూ.1.7 కోట్ల షేర్ ను రాబట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు