కృష్ణా జిల్లాలో సగం అసలు రాబట్టిన బాలయ్య !


బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కలయికలో రూపొందిన ‘పైసా వసూల్’ చిత్రం గత శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మల్టీ ప్లెక్సులు, ఏ సెంటర్లలో సినిమా అంతగా ప్రభావం చూపకపోయినా బాలకృష్ణకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న బి, సి సెంటర్లలో వసూళ్లు మెరుగ్గానే ఉన్నాయి. నిన్న 5వ రోజు కృష్ణా జిల్లాలో రూ.4,06,014 షేర్ ను రాబట్టిన ఈ చిత్రం మొత్తంగా రూ. 1,05,96,305 షేర్ ను షేర్ ను ఖాతాలో వేసుకుంది.

కృష్ణా హక్కులు రూ. 2 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడవగా మొదటి 5 రోజుల్లోనే అందులో సగం వసూలవ్వడం చూస్తే మాస్ ప్రేక్షకుల్లో బాలయ్య ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇక రాబోయే శుక్రవారం కూడా భారీ సినిమాల విడుదల లేకపోవడం ఈ చిత్ర వసూళ్లకు కాత్స కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో ముస్కాన్ సేతి, కైరా దత్ లు హీరోయిన్లుగా నటించారు.