మరో ప్రోమోతో రెడీ అయిన బాలయ్య !


నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. స్టంపర్, ట్రైలర్లతో అదరగొట్టిన ఈ చిత్రం వరుసగా పాటల ప్రోమోలను విడుదలచేస్తూ ప్రేక్షకుల మాటల్లో నానుతూ వస్తోంది. ఇప్పటికే మంచి పాజిటివ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లతో మరింతగా జనాల్లోకి వెళ్లాలని చూస్తోంది. అందుకే ఈరోజు ఆల్బమ్ లోని మరొక పాట ‘కొంటె నవ్వు’ ప్రోమోను రిలీజ్ చేయనున్నారు.

ఇది వరకు విడుదలైన మూడు పాటల ప్రోమోలు విశేషంగా క్లిక్ అవడంతో ఈ ప్రోమో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తుందని టీమ్ భావిస్తోంది. బాలయ్య గత సినిమాలకు పూర్తి భిన్నంగా, పక్కా కమర్షియల్ అంశాలుగా రూపొందిన ఈ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ బాలకృష్ణ సరసన శ్రియ శరన్, ముస్కాన్ సేతిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కైరా దత్ ప్రత్యేక పాటలో మెరవనుంది.