ఓవర్సీస్లో ‘పైసా వసూల్’ వసూళ్లు ఎలా ఉన్నాయంటే !


నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన సంగతి విథితమే. సినిమాపై ఉన్న భారీ అంచనాలు మూలాన మొదటి రోజు ఓపెనింగ్స్ బ్రహ్మాండమైన రీతిలో వచ్చాయి. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.8.9 కోట్లను రాబట్టిందీ చిత్రం. అయితే మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ వసూళ్లు సాధారణ స్థాయిలోనే ఉన్నాయి.

గురువారం ప్రీమియర్లు, శుక్రవారం షోల ద్వారా 1.38 లక్షల డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా శనివారం రోజు 75 లొకేషనల్లో కలిపి 21 వేల డాలర్లను రాబట్టింది. పూరి జగన్నాథ్ బాలయ్యను తేడా సింగ్ పాత్రలో సరికొత్తగా చూపిన విధానం అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకోగా కథ కథనాల విషయంలో మాత్రం కొంత నిరుత్సాహపరిచింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.