ప్రమోషన్లలో ప్రతాపం చూపిస్తున్న ‘పైసా వసూల్’ !


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన నందమయూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న సంగతి విదితమే. దీంతో చిత్రం టీమ్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గరనుండి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అలెర్ట్ గా ఉంటూ స్టంపర్, టీజర్, ట్రైలర్స్, ప్రోమోస్ అంటూ రక రకాల అంశాలతో బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రం ఇంకాస్త స్పీడు పెంచి ప్రమోషన్లు చేస్తోంది.

ఇప్పటీకే ఆడియో వేడుక పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన యూనిట్ పాటలకు మంచి ఆదరణ దక్కడంతో ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఆడియో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. దీంతో సినిమాకు మరింతగా ప్రచారం లభించనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రియ, ముస్కాన్ సేతిలు హీరోయిన్లుగా నటించగా కైరా దత్ ప్రత్యేక గీతంలో బాలయ్యతో ఆడిపాడింది.