బాలయ్య సినిమాలో అభిమానులు కోరుకునేవన్నీ దొరుకుతాయట !
Published on Jul 26, 2017 9:02 am IST


నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలు మాత్రమే కాక ఒక ప్రత్యేకమైన ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఊహకు కూడా రాని విధంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ సినిమానౌ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి. రెండు విభిన్న శైలిలు కలిగిన ఈ ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎలాంటి ఔట్ ఫుట్ బయటికొస్తుందో చూడాలని అందరూ ఆతురతగా వెయిట్ చేస్తున్నారు.

అందుకు తగ్గట్టే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా గురించి ఇంకాస్త తెలిసేలా ఈ నెల 28 ఉదయం 10 గంటల 13 నిముషాలకు ‘పైసా వసూల్’ స్టంపర్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్లకు భిన్నంగా ఉండే ఈ స్టంపర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోతుందట. ఇక సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్, పాటలు, డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాలు ఇలా బాలకృష్ణ నుండి అభిమానులు కోరుకునే ప్రతి అంశం ఉంటుందని పూరి అంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook