‘పైసా వసూల్’ తొలిరోజు వసూల్ ఎంతంటే !


బాలకృష్ణ నటించిన తాజా చిత్రం పైసా వసూల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్ లో బాలకృష్ణ కొత్తగా కనిపించాడు. ఈ చిత్రం లోని పంచ్ డైలాగులు బాలయ్య ఫాన్స్ ని బాగా అలరిస్తున్నాయి. కాగా తొలిరోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లనే రాబట్టింది.

కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యకు ఇదే బెస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం. తొలిరోజు దాదాపు 8 కోట్ల షేర్ ని సాధించడం విశేషం. శనివారం కూడా మంచి వసూళ్లనే రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ మరియు తెలంగాణలలో తొలిరోజు కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా కలెక్షన్లు
నైజాం 1.64 కోట్లు
సీడెడ్ 1.8 కోట్లు
నెల్లూరు 37 లక్షలు
గుంటూరు 1.54 కోట్లు
కృష్ణా 52 లక్షలు
ఉత్తరాంధ్ర 80 లక్షలు
ఈస్ట్ గోదావరి 70 లక్షలు
వెస్ట్ గోదావరి 58 లక్షలు
మొత్తం
7.96కోట్లు