“పక్కా కమర్షియల్” టీజర్ రేపే విడుదల!

“పక్కా కమర్షియల్” టీజర్ రేపే విడుదల!

Published on Nov 7, 2021 4:28 PM IST

గోపీచంద్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. యూ వీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ ను చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను రేపు విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది.

గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు