“పక్కా కమర్షియల్” టైటిల్ సాంగ్ గ్లింప్స్ నేడు విడుదల

Published on Jan 31, 2022 1:30 pm IST


గోపీచంద్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. రాశి ఖన్నా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుండగా, సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకాల పై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేయనుంది. ఈ టైటిల్ సాంగ్ గ్లింప్స్ ను నేడు సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాట ఫిబ్రవరి 2 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :