రానా “విరాటపర్వం” నుంచి అరిరిపోయే అప్డేట్..!

Published on Jun 12, 2022 2:00 am IST

దగ్గుబాటి రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “విరాటపర్వం”. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు జూన్ 17న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన మేకర్స్ అందుకు తగ్గట్టుగా ప్రమోషన్లను కూడా గట్టిగానే జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు సాయంత్రం “ఛలో ఛలో” అంటూ సాగే వారియర్ సాంగ్‌ను జూన్ 12వ తేదిన విడుదల చేయబోతున్నటు ప్రకటించింది. ఈ పాటను రానా స్వయానా ఆలపించడం విశేషం. కాగా ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం :