రెండు ఓటిటి సంస్థలకి “పక్కా కమర్షియల్” స్ట్రీమింగ్ హక్కులు.!

Published on Jun 26, 2022 12:00 am IST

మ్యాచో స్టార్ గోపీచంద్ అలాగే హీరోయిన్ రాశి ఖన్నాలు నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “పక్కా కమర్షియల్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా ఇప్పుడు మేకర్స్ అయితే సాలిడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రమోషనల్ టూర్స్ లో బిజీగా ఉన్న ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఓటిటి పార్ట్నర్స్ కి సంబంధించి న్యూస్ తెలుస్తుంది.

మరి ఈ చిత్రం తాలుకా ఓటిటి హక్కులను రెండు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు తీసుకున్నారట. మరి వాటిలో ఒకటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాగా మరొకటి అణా తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా అట. ఈ రెండు స్త్రీమింగ్స్ సంస్థలతో ఓటిటి డీల్ మేకర్స్ లాక్ చేసుకున్నారట. దీనితో థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన కొన్ని వారాల తర్వాత ఈ చిత్రం ఈ ఓటిటి యాప్స్ లో అందుబాటులోకి రానుంది.

సంబంధిత సమాచారం :