పక్కా ప్రామిసింగ్ ఎంటర్టైనర్ గా “పక్కా కమర్షియల్” ట్రైలర్.!

Published on Jun 12, 2022 3:57 pm IST

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు మారుతీ కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పక్కా కమర్షియల్”. సినిమా స్టార్ట్ చేసిన నాటి నుంచి ఈరోజు వరకు మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు గోపీచంద్ బర్త్ డే సందర్భంగా అవైటెడ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేశారు.

అయితే ఈ ట్రైలర్ మాత్రం ఊహించని విధంగా ఉందని చెప్పాలి. ఇది వరకు వచ్చిన టీజర్, సాంగ్స్ ని మించి చాలా కొత్త ప్రెజెంటేషన్ మరియు సబ్జెక్ట్ తో కనిపిస్తుంది. ముఖ్యంగా మారుతీ మార్క్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అన్నట్టు ఈ ట్రైలర్ మంచి ఎలిమెంట్స్ తో కనిపిస్తుంది. హీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్ పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది.

అలాగే తనతో పాటుగా రాశీ ఖన్నా రోల్ కూడా మంచి ఆసక్తిగా ఉన్నాయి. ఇంకా సత్య రాజ్ మరియు గోపీచంద్ ల మధ్య ఎమోషనల్ డ్రామా కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుండగా రావు రమేష్ రోల్ అయితే సర్ప్రైజింగ్ గా ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే థియేటర్స్ లో పక్కాగా సాలిడ్ ఫీస్ట్ ఈ ట్రైలర్ తో ప్రామిసింగ్ గా కనిపిస్తుంది.

ఇక ఈ ట్రైలర్ లో జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే గీతా ఆర్ట్స్ 2, యూవీ ప్రొడక్షన్ హౌస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. మరి ఈ జూలై 1న వచ్చే సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :