“పక్కా కమర్షియల్” వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్ ఎంతంటే.!

“పక్కా కమర్షియల్” వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్ ఎంతంటే.!

Published on Jul 2, 2022 1:10 PM IST

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ ఎంటర్టైనింగ్ చిత్రం “పక్కా కమర్షియల్”. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ప్రమోషన్స్ తో డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ నిన్న అయ్యింది. అయితే ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందనే వస్తుండగా ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

మరి వారు చెబుతున్న దాని ప్రకారం అయితే ఈ చిత్రంతో గోపీచంద్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినట్టుగా తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ డే 6.30 కోట్ల గ్రాస్ ని అందుకుందని వారు తెలియజేసారు. ఇది అయితే మరి రీసెంట్ గా వస్తున్న సినిమాల్లో బెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. ఇంకా ఈ వారాంతానికి అయితే ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయో అనేది కూడా చూడాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు