‘పలాస’ ఫేమ్ రక్షిత్ హీరోగా ‘శశివదనే’ ప్రాజెక్ట్ ప్రారంభం.!

‘పలాస’ ఫేమ్ రక్షిత్ హీరోగా ‘శశివదనే’ ప్రాజెక్ట్ ప్రారంభం.!

Published on Nov 16, 2021 6:49 PM IST


టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఇంపాక్ట్ కలిగించిన చిత్రాల్లో ‘పలాస 1978’ కూడా ఒకటి. అయితే ఈ సినిమాతో ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. మంగళవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సినిమా పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు మారుతి క్లాప్ ఇచ్చారు. సంగీత దర్శకులు రఘు కుంచె కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత శరత్ మరార్ తదితర ప్రముఖులు ఈ ముహూర్త కార్యక్రమానికి హాజరయ్యారు.

మరి ఈ సందర్భంగా హీరో రక్షిత్ మాట్లాడుతూ “తేజగారు చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. దర్శకుడు సాయి గారికి అద్భుతమైన విజన్ ఉంది. రెహమాన్ గారి శిష్యుడు శరవణ వాసుదేవన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కోమలీ, గ్యారీ… మంచి టీమ్ కుదిరింది. మంచి సినిమా అవుతుంది. ‘పలాస’ తర్వాత ‘నరకాసుర’ అనే సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఇది మంచి ప్రేమకథ అవుతుంది. ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశీర్వదించాడానికి వచ్చిన మారుతి గారు, రఘు కుంచె గారు, శరత్ మరార్ గారు… అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు” అని అన్నాడు.

అలాగే నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ “మేం ఈ సినిమా టైటిల్ సెప్టెంబర్ లో అనౌన్స్ చేశాం. టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. రక్షిత్ గారు, కోమలి ప్రసాద్ గారి పెయిర్ చాలా బావుంది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఇదే తొలి సినిమా. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నాం” అని తెలిపారు..

హీరోయిన్ కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ “ఈ ప్రాజెక్ట్ చాలా స్పెషల్. ఈ చిత్రానికి పని చేస్తున్న అందరూ ఒకరికి ఒకరు తెలిసినవాళ్లే. సాయి మోహన్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు… నేరేషన్ స్టార్ట్ చేసిన ఐదు నిమిషాలకు ఓకే చెప్పేశా. నేరేట్ చేస్తుంటే… సినిమా కనిపించింది. తేజ గారు ప్రొడక్షన్ అని తెలిసినప్పుడు ఇంకా హ్యాపీ ఫీలయ్యా. వాళ్ల ఆఫీసులో సినిమాలో సాంగ్స్ రఫ్ ట్రాక్స్ విన్నాను. చాలా హ్యాపీ” అని తెలిపింది.

అలాగే ఈ సినిమా ఎడిటర్, త్వరలో దర్శకుడిగా పరిచయం కానున్న గ్యారీ మాట్లాడుతూ “ఇది మంచి కథ. విన్నప్పటి నుంచి నేనే చేస్తానని వెంట పడుతున్నాను. మంచి కథ, మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. తేజ నాకు మంచి ఫ్రెండ్” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.

ఇక ఈ చిత్రం సాంకేతిక విభాగానికి వస్తే పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: గ్యారీ బీహెచ్, కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్ (డెక్కన్ డ్రీమ్స్), సీఈవో: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ – సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు