ఫ‌స్ట్ లుక్ లాంచ్ లో ‘ప‌లాస 1978’ !

Published on Jun 18, 2019 3:00 pm IST

ఉత్తారాంధ్ర‌లోని ప‌లాస ప్రాంత ఆత్మ‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ‘‘ప‌లాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది. తెలుగుసినిమా క‌థ‌లు కొన్నిచ‌ట్రాల్లో బిగుసుపోయిన టైంలో కంచెర‌పాలం ఆ గిరిని దాటుకొని కొత్త అనుభూతుల‌ను ప్రేక్ష‌కుల‌కు పంచింది. ఆ కోవ‌లో ప‌లాస చిత్రం కూడా ఒక నిజ‌మైన
ఎమోష‌న్స్ చుట్టూ , స‌మాజంలో పేరుకుపోయిన అస‌మాన‌త‌లుకు వెండితెర రూపంగా రూపొందింది.

గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్, సుబ్రహ్మణ్యపురం తరహాలో రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ను హీరో ర‌క్షిత్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి ,చిత్ర సమర్పకులు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ లాంచ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా మారుతిగారు మాట్లాడుతూః నిర్మాత ప్ర‌సాద్ గారు క‌థ చెప్పిన‌ప్పుడు మాములు క‌థ అనుకున్నాను. కానీ ఇప్పుడు సినిమా గురించి తెలిసాక ఈ క‌థ‌ను ఆ ఊరిలో ఉండి, తిరిగి, అనుభ‌వించి రాసారు. మంచి ఇంటెన్ష‌న‌ల్ క‌థ‌ను తీసుకున్నారు. కంచెర‌పాలెం లాగా ఇది ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More