పాన్‌ ఇండియా పై హీరో కామెంట్స్ వైరల్ !

Published on May 2, 2022 7:05 am IST

పాన్‌ ఇండియా సినిమా అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. పైగా పాన్‌ ఇండియా అనే పదం చుట్టూ ప్రస్తుతం అటు నార్త్‌ హీరోలకు ఇటు సౌత్‌ హీరోలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఐతే, తాజాగా ఇదే అంశంపై హీరో సిద్దార్థ్‌ స్పందిస్తూ తనదైన శైలి కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఏమిటో సిద్దార్థ్‌ మాటల్లోనే విందాం.

‘అసలు పాన్‌ ఇండియా అన్నది అగౌరవకరమైనది, అదో నాన్సెన్స్‌. అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్‌ ఇండియా అని ఎందుకంటున్నారు ? 15 ఏళ్ల క్రితమే రోజా అనే పాన్‌ ఇండియా సినిమా రాలేదా ?, మణిరత్నం డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారు. నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది. అందుకే పాన్‌ ఇండియా అన్న పదం తీసేసి ఇండియన్‌ సినిమా అని పేరు పెట్టాలి అంటూ సిద్దార్థ్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :