హీరో నవదీప్ కి పాన్ ఇండియా హీరో కాస్ట్లీ గిఫ్ట్‌

Published on May 13, 2022 5:01 pm IST

గౌతమ్ SSC, చందమామ, మరియు ఆర్య 2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు నవదీప్ ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో తిరుగుతూ బిజీగా ఉన్నాడు. ఈ హీరోకి పాన్ ఇండియా హీరో నుంచి స్పెషల్ గిఫ్ట్ లభించింది. నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తీసుకొని స్టోరీ లో ఒక చిత్రాన్ని షేర్ చేయడం జరిగింది.

పుష్ప హీరో అల్లు అర్జున్ బహుమతిగా ఇచ్చిన ఎయిర్‌పాడ్‌ల చిత్రాన్ని అతను పోస్ట్ చేశాడు. అతను ఇలా వ్రాశాడు, “ప్రేమకు అవధులు లేనప్పుడు, బహుమతులు సందర్భానుసారంగా ఉంటాయి. ధన్యవాదాలు, బావ్స్ అల్లు అర్జున్. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్ తో ఎయిర్ పొడ్స్ వాడతా” అంటూ చెప్పుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య 2లో వారిద్దరూ స్నేహితులుగా నటించారు. వర్క్ ఫ్రంట్‌లో, నవదీప్, అవనీంద్ర దర్శకత్వం లో లవ్ మౌళిలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :