గ్లోబల్ స్టార్ చరణ్ కి పాన్ ఇండియా ప్రొడ్యూసర్ స్పెషల్ థాంక్స్.!

Published on May 30, 2023 11:14 am IST


రీసెంట్ గానే మన టాలీవుడ్ గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సరికొత్త ప్రొడక్షన్ హౌస్ ని అయితే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. యూవీ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ తో కలిసి స్టార్ట్ చేసిన వి మెగా ప్రొడక్షన్ హౌస్ అయ్యితే తమ మొదటి సినిమానే ప్రైడ్ ఇండియన్ సబ్జెక్టు “ది ఇండియన్ హౌస్” ని స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమా అయితే ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ తో అయితే కొలాబరేట్ అయ్యి అనౌన్స్ చేశారు.

మరి ఈ అంశంపై అయ్యితే లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి భారీ హిట్స్ ఇచ్చిన ఏఈ ప్రొడ్యూసర్ చరణ్ ని స్పెషల్ థాంక్స్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మొదటగా తనని తన సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసారు. తనది సినిమా బ్యాక్ డ్రాప్ కాకపోయినప్పటికీ నిర్మాతగా నన్ను ఎంతగానో వారు ఆదరించారని తెలిపారు.

ఇక మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే నన్ను నమ్మి ఈ సినిమాకి నన్ను కూడా భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందని. ఖచ్చితంగా ఇండియన్ హౌస్ చిత్రం మంచిపోలేని ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఒక ప్రైడ్ ఇండియన్ గా మన దేశపు సంస్కృతిని, చరిత్ర విషయంలో ఎంతో గర్వంగా ఉన్నానని మరింతమంది కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తూ ఇండియన్ సినిమాని గ్లోబల్ వైడ్ గా తీసుకెళ్తానని తెలిపారు.

సంబంధిత సమాచారం :