వైరల్ పిక్ : లేటెస్ట్ స్టైలిష్ లుక్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Published on Feb 11, 2023 3:00 am IST


ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఇటీవల పూజా హెగ్డే హీరోయిన్ గా ఆయన నటించిన రాధేశ్యామ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఓం రౌత్ తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కె, మారుతీ తో ఒక మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఆ విధంగా ఏమాత్రం విశ్రాంతి లేకుండా గడుపుతున్న ప్రభాస్, వాటితో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఖుషి చేయాలని ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఈ సినిమాలన్నిటి పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే, నేడు పలువురు తన అభిమానులతో ప్రభాస్ ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేటెస్ట్ స్టైల్ షర్ట్, గ్లాసెస్ తో ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్ ప్రస్తుతం ట్రెండింగ్ గా వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఆ స్టైలిష్ పిక్ పై ఒక లుక్ వేయండి.

సంబంధిత సమాచారం :