రమేష్ నాయుడు దర్శకత్వంలో పంచనామ…టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దిల్ రాజు!

Published on Dec 3, 2021 7:00 am IST

గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము లు హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం పంచనామ. ఈ పంచనామ టైటిల్ ను దిల్ రాజు గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ, ” ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు నిర్మాతలకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ, “ఈ చిత్రాన్ని కథ లోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ తో అర్థమైంది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియజేస్తున్నాము. మా ఈ ఫస్ట్ లుక్ కి ఇంతటి ఆదరణ తీసుకొచ్చిన పి ఆర్ ఓ మధు గారికి మరియు ఆయన టీం కి ధన్యవాదాలు” అని అన్నారు.

త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్ జాధవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్మి, ఆంజనేయులు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సిగటాపు రమేష్ నాయుడు, నిర్మాతలు గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము, ఎడిటర్ బసవ రెడ్డి,
సినిమాటోగ్రఫీ పవన్ గుంటుకు, సంగీతం ప్రదీప్ చంద్ర, పి.ఆర్.ఓ మధు లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :