సాలిడ్ ఎమోషన్స్ తో “పంచతంత్రం” ట్రైలర్.!

సాలిడ్ ఎమోషన్స్ తో “పంచతంత్రం” ట్రైలర్.!

Published on Nov 26, 2022 4:05 PM IST

గత కొంత కాలం నుంచి తొళువూడ్ టాలీవుడ్ లో డీసెంట్ బజ్ తో కొనసాగుతున్న మరో బ్యూటిఫుల్ ఆంథాలజీ చిత్రం “పంచతంత్రం”. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా ఓ ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రానికి ముందు నుంచి ఉండగా ఈరోజు అయితే మేకర్స్ ఈ చిత్రం తాలుకా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

అయితే బ్రహ్మానందనం మాటలతోనే స్టార్ట్ అయ్యిన ఈ ట్రైలర్ మొత్తం ఐదు వేరే వేరే కథలతో స్టార్ట్ కాగా సీనియర్ నటులు సముద్రఖని, నుంచి యంగ్ నటీ నటులు నరేష్ అగస్త్య, స్వాతి రెడ్డి, దివ్య ద్రిష్టి, ఆదర్శ్ బాలకృష్ణలపై చూపించిన ప్రతి స్టోరీ చాలా హార్ట్ టచింగ్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాస్ట్ లో ఎమోషన్స్ అయితే చాలా హార్డ్ హిట్టింగ్ అనిపిస్తున్నాయని చెప్పొచ్చు.

ఒకొక్కరి కథలోని సెన్సిబుల్ ఎమోషన్స్ ఓ ఫీల్ గుడ్ అనుభూతిని అందించడమే కాకుండా మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ ఫీల్ గుడ్ ఆంథాలజీ చిత్రం చూస్తున్నాం అనిపించేలా ఉంది. మరి డైరెక్టర్ హర్ష పులిపాక సాలిడ్ వర్క్ ని అందించారని చెప్పాలి. అలాగే శ్రవణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం ట్రైలర్ లో బాగున్నాయి. మరి ఈ చిత్రాన్ని అయితే టికెట్ ఫ్యాక్టరీ మరియు ఎస్ ఒరిగినల్స్ బ్యానర్ వారు నిర్మాణం వహించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు