విడుదలైన “పంచతంత్రం” టీజర్!

Published on Oct 13, 2021 12:27 pm IST

బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మీక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య దృష్టి, వికాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మ్యాజికల్ డ్రామా పంచతంత్రం. టికెట్ ఫ్యాక్టరీ మరియు ఎస్ ఒరిజినల్స్ పతకాల పై అఖిలేష్ వర్ధన్ మరియు సృజన్ యరబోలు సంయుక్తం గా నిర్మిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్. విహారి అందిస్తున్నారు.

తాజాగా పంచతంత్రం నుండి టీజర్ విడుదల అయింది. అయితే ఈ టీజర్ ఎంతో ఆసక్తిగా ఉంది. కథల గురించి చెప్తూ ఉన్నటువంటి ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ సత్యదేవ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ లో ప్రధాన తారాగణం అంతా కనపడింది. ఈ టీజర్ కథలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. టీజర్ ఆసక్తిగా ఉండటం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :