త్వరలో థియేటర్లలోకి రానున్న ‘పంచతంత్రం’.. టీజర్ రిలీజ్..!

Published on Oct 14, 2021 12:09 am IST


హాస్యనటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ పదిలమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. నేడు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “సినిమా గురించి చెప్పేముందు మా పార్ట్నర్, ‘ఎస్ ఒరిజినల్స్’ అధినేత సృజన్ గురించి చెప్పాలి. ఈ సినిమా నిర్మాతల్లో ఆయన ఒకరు. అమెరికాలో డాన్ లాగా! మేం ఒక సినిమా చేయడానికి కష్టపడుతుంటే.. సరదాగా ఆరేడు సినిమాలు లైనప్ లో పెట్టారు. హర్ష, ప్రశాంత్, రాజ్, గ్యారీ, భువన్, నా పార్ట్నర్ ఉష, నా స్నేహితులు సునీత్, అఖిల్… వీళ్ళు లేకపోతే సినిమా కంప్లీట్ అవ్వదు. వీళ్ళందరికీ థాంక్స్. మా సినిమాలో నటించిన నటీనటులు అందరికీ సారీ. మేమంతా కొత్తవాళ్ళం. చాలా ఇబ్బందులు పెట్టి, డబ్బులు కూడా కాస్త తక్కువ ఇచ్చి సినిమా చేశాం. సినిమా, రిజల్ట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నామని అన్నారు.

దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ “ఈ సినిమా ఒక అమ్యూజ్‌మెంట్‌ పార్క్ లాంటిది. టికెట్ తీసుకుని అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు వెళితే డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. అలాగే మా సినిమాలో కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. ప్రతి అరగంటకు ప్రేక్షకుల్ని కొత్త రైడ్ కి తీసుకువెళతాం. నేను కథ రాయడం ప్రారంభించిన తర్వాత నాకు అండగా నా వెనుక ఉన్నది మా నిర్మాత అఖిలేష్. మా ఇద్దరికీ ఇది తొలి సినిమా. ఎటువంటి డౌట్స్ లేకుండా షూటింగ్ కు వెళ్లాం. స్క్రిప్ట్ ఫినిష్ అయ్యాక మా చేతిలో ఓ బంగారు ఆభరణం ఉన్నట్టు ఉంది. దానికి డైమండ్ సెట్స్ కావాలి. ఆ డైమండ్స్ మా సినిమాలో నటించిన యాక్టర్స్. అందరూ ఫెంటాస్టిక్ పీపుల్. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి సహకరించిన టెక్నికల్ టీమ్ కి థాంక్స్. మేం అడిగిన వెంటనే టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన సత్యదేవ్ గారికి థాంక్స్. త్వరలో థియేటర్లలో మా సినిమా విడుదల కాబోతుందని అన్నారు.

సహ నిర్మాత రమేష్ వీరగంధం మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన అఖిలేష్ గారికి థాంక్యూ అని టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నానని అన్నారు.

రాహుల్ విజయ్ మాట్లాడుతూ మా టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సత్యదేవ్ గారికి థ్యాంక్స్ అని, ‘అనగనగా ఓ పెద్ద అడవి. అందులో జంతువులన్నీ కూడు, గూడు, తోడు వెతుక్కున్నాక.. నాలుగో జీవనాధారం కోసం అన్నీ ఒక చోట కలిసి కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాయి’ (టీజర్ లో వాయిస్ ఓవర్ ఇది). అలాగే, మేం కూడా! అనగనగా ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్లు, టెక్నీషియన్లు మా పనులు మేం చేసుకుంటూ ఉంటే.. ఒక కొత్త జీవనాధారం కోసం ‘పంచతంత్రం’ అని ఒక సినిమా చేశాం. ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుందని అన్నారు.

సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మాట్లాడుతూ “ఈ సినిమాలో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది. ఐదు భిన్నమైన కథలు.. ఐదు భిన్నమైన అనుభూతులు.. సినిమాలో ఎంతో ఉంది. సంగీత పరంగా ఎంతో స్కోప్ ఉన్న సినిమా. మంచి పాటలు ఇచ్చే ప్రయత్నం చేశా. చిన్నతనం నుంచి నేను బ్రహ్మానందంగారి భక్తుడిని. ఆయనతో పని చేసే అవకాశం ఈ సినిమాతో వచ్చింది.

శ్రీవిద్య మహర్షి మాట్లాడుతూ సినిమాలో ఐదు భిన్నమైన భావోద్వేగాలను ఐదు కథల్లో చూపించారు. ప్రత్యక్షంగా వేదికపై ఉన్న వారందరితో కలిసి పని చేయలేకపోయినా పరోక్షంగా పని చేయడం కుదిరింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. దర్శకుడు హర్షకు తొలి సినిమా అయినప్పటికీ మా అందరినీ బాగా చూసుకున్నాడు. మా నిర్మాత అఖిలేష్ గారికి కూడా ఇది తొలి సినిమా. ఆయన కూడా పెద్దరికంతో సినిమా చేశారు. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. అందరూ టీజర్ చూశారని అన్నారు.

వికాస్ మాట్లాడుతూ “తెలుగులో నా రెండో చిత్రమిది. ఇంత భారీ తారాగణంతో నటించడం చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత అఖిలేష్, దర్శకుడు హర్షకు థాంక్స్. క్రికెట్ లో ధోనిలా మా హర్ష కూడా చాలా కూల్, సైలెంట్. హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ థిస్ ఫిల్మ్” అని అన్నారు.

దివ్య శ్రీపాద మాట్లాడుతూ “కథ చదివినప్పుడు, స్క్రిప్ట్ విన్నప్పుడు… పర్సనల్ గా మనకు కనెక్ట్ అయ్యేవి తక్కువ ఉంటాయి. ఈ కథ నాకు కనెక్ట్ అయింది. సినిమా చూసే ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. టీజర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వర్క్ చేసినట్టు అనిపించింది” అని అన్నారు.

నరేష్ అగస్త్య మాట్లాడుతూ “ఇప్పుడే ‘పంచతంత్రం’ టీజర్ చూశా. ఈ సినిమాలో నేను నటించిన కథ మాత్రమే నాకు తెలుసు. ఓ సాధారణ ప్రేక్షకుడిలా సినిమా చూడాలనే ఎగ్జైట్మెంట్ నాలో ఉంది. మిగతా నాలుగు కథలు, బ్రహ్మానందం గారి కథ నాకు తెలియదు. హర్ష మిగతా కథలు చెబుతానన్నాడు. కానీ, వద్దన్నాను. ‘నా కథ నాకు నచ్చింది. నా కథ చేసేసి వెళ్ళిపోతా. మిగతా సినిమా థియేటర్లో చూస్తానని చెప్పాను. హర్ష చెప్పిన కథ నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఆల్మోస్ట్ నా రియల్ లైఫ్ అని చెబుతానని అన్నారు.

ఆదర్శ్ బాలకృష్ణ మాట్లాడుతూ థియేటర్లలో అడుగుపెట్టినప్పుడు ప్రెస్‌మీట్‌కు వచ్చాననే సంగతి మర్చిపోయి ఫస్ట్ సీట్‌లో కూర్చున్నాను. సాధారణంగా ఎవరైనా చివరి సీట్‌లో కూర్చుంటారు కదా! కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇంకా ఎక్కువమంది వస్తారని ఆశిస్తున్నాను. చిన్నతనంలో మా అమ్మమ్మ నాకు ‘పంచతంత్రం’ కథల పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్లినా ఆ పుస్తకాలను తోడుగా తీసుకువెళ్ళేవాడిని. విపరీతంగా చదివేవాడిని. ఐదు కథలను యాంథాలజీ సినిమాగా తీశారు. దర్శకుడు హర్ష చాలా మెచ్యూరిటీ, క్లారిటీతో సినిమా తీశాడు. నేను కూర్గ్ లో వేసే సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు హర్ష వాట్సాప్ లో స్క్రిప్ట్ పంపాడు. అప్పుడే డిన్నర్ వచ్చింది. త్వరగా కథ చదివేసి డిన్నర్ చేద్దామని అనుకున్నా. స్క్రిప్ట్ చదివిన అరగంట పాటు ఏమీ మాట్లాడలేదు. ఫోన్ పక్కన పెట్టి ఎమోషన్ లో ఉండిపోయాను. ఆ తర్వాత హర్షకు ఫోన్ చేసి అద్భుతంగా ఉందని చెప్పాను. ఇందులో నేను స్వాతితో కలిసి నటించాను. తనతో ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బై అప్పలరాజులో తనతో కలిసి నటించా. ఈ సినిమాలో నా నటన అందరికీ నచ్చితే ఆ క్రెడిట్ స్వాతి, హర్షదే. ‘పంచతంత్రం’లో నటించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం :