‘పండగ చేస్కో’ లాస్ట్ డే షూట్..!

pangaga-chesku
రెండు వరుస అపజయాల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న సంకల్పంతో ఉన్నాడు హీరో రామ్. ఈ క్రమంలోనే ‘పండగ చేస్కో’, ‘శివం’, ‘హరికథ’ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా మారిపోయాడు. ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని ‘పండగ చేస్కో’ సినిమాకు దర్శకుడు. నేడు సెట్‌లో తీసిన ఓ పాటతో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. టాకీ పార్ట్ పూర్తవ్వగానే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

హీరో రామ్‌తో పాటు హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్‌లు పాల్గొనగా మిగిలి ఉన్న చివరి పాటను నేడు చిత్రీకరించారు. చివరి రోజు షూటింగ్ కావడంతో సినిమాలో నటించిన రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్‌లు ఓ సెల్ఫీకి పోజులిచ్చారు. ఈ సెల్ఫీని రకుల్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ నెలాఖర్లో ‘పండగ చేస్కో’ ఆడియోను, మే 14న సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Exit mobile version