“ఆదికేశవ” గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్!

Published on May 15, 2023 5:07 pm IST


డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కొత్త హీరోగా నటిస్తున్న చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ నటి శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ రోజు, మేకర్స్ మునుపెన్నడూ చూడని పాత్రలో పంజా వైష్ణవ్ తేజ్‌ను ప్రదర్శించే ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అతను యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆదికేశవ అనే టైటిల్ ఖరారు చేయడం జరిగింది. ఆలయ భూమిని ఆక్రమించాలని ప్లాన్ చేసిన గూండాలపై రుద్ర కాళేశ్వర్ రెడ్డి ఎలా పోరాడాడో ఫస్ట్ గ్లింప్స్ లో చూపించడం జరిగింది.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్న టీజర్‌లో వెల్లడి కానున్నాయి. అపర్ణా దాస్, జోజు జార్జ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం జూలై 2023లో విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :