ఇంట్రెస్టింగ్ గా “ఆదికేశవ” ట్రైలర్!

Published on Nov 20, 2023 5:56 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా, డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. ఈ చిత్రం ను నవంబర్ 24, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబందించిన ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఫ్రెష్ లవ్ కాన్సెప్ట్ తో పాటుగా, యాక్షన్ ఎలిమెంట్స్ ట్రైలర్ లో పుష్కలం గా ఉన్నాయి. సినిమా అటు ఫన్, లవ్ ఎలిమెంట్స్ తో పాటుగా, యాక్షన్ ను కూడా సాలిడ్ గా చూపించినట్లు ట్రైలర్ ను చూసి చెప్పవచ్చు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :