‘పంజా’ డైరెక్టర్ తో అజిత్ భారీ సినిమా.?

Published on Sep 30, 2022 3:01 am IST


టాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాల్లో ప్లాప్ అయినప్పటికీ మంచి ఆదరణ ఉన్న చిత్రాల్లో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “పంజా” చిత్రం కూడా ఒకటి. అలాగే పంజా సినిమాకి గాని ఆ సినిమా దర్శకుడు విష్ణు వర్ధన్ టేకింగ్ కానీ పవన్ ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ ప్లేస్ ఉంది.

మరి విష్ణు వర్ధన్ తెలుగులో మొదటిసారి చేసిన సినిమా ఇది కాగా పవన్ ని అయితే చాలా స్టైలిష్ గా అప్పట్లో గడ్డం లుక్ తో ట్రెండ్ సెట్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. అయితే విష్ణు వర్ధన్ తమిళ్ లో అక్కడి బిగ్ స్టార్ అజిత్ కుమార్ తో కూడా కొన్ని సాలిడ్ చిత్రాలు కూడా చేశారు.

మరి ఈ కాంబోలో అయితే మళ్ళీ ఇన్నాళ్లకు ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం అయితే ఓ భారీ పీరియాడిక్ సబ్జెక్టు అని అలాగే అజిత్ పాత్ర కూడా నెవర్ బిఫోర్ లెవెల్ లో ఉంటుందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :