వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి”

Published on Jun 4, 2023 9:57 pm IST


టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా, నటుడు, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ చిత్రం లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించడం జరిగింది. థియేటర్ల లో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం అనుకున్న రీతిలో వసూళ్లను రాబట్టలేదు.

ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. వచ్చే ఆదివారం జెమిని టీవీ లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :