డిస్నీ+ హాట్ స్టార్ నుంచి మరో తెలుగు సిరీస్ ‘పరంపర’ ట్రైలర్ రిలీజ్..!

డిస్నీ+ హాట్ స్టార్ నుంచి మరో తెలుగు సిరీస్ ‘పరంపర’ ట్రైలర్ రిలీజ్..!

Published on Dec 15, 2021 10:40 PM IST

జగపతిబాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నవీన్ చంద్ర, ఇషాన్, ఆకాంక్ష సింగ్‌తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మించిన సిరీస్ ‘పరంపర’. కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ నెల 24 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘బాహుబలి’ సిరీస్‌తో ఆకట్టుకున్న నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా పతాకంపై ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను సమకూర్చారు. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌లో అధికారం, అవినీతి, తరతరాల శత్రుత్వం ప్రధానాంశాలుగా ఉండనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు