‘హ్యాపీ బర్త్‌డే’ నుంచి పార్టీ సాంగ్.. ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి!

Published on Jul 4, 2022 4:17 pm IST


‘మత్తు వదలరా’ సినిమాతో డైరెక్టర్‌గా హిట్ అందుకున్న రితేష్ రానా దర్శకత్వంలో రాబోతున్న కొత్త మూవీ ‘హ్యాపీ బర్త్‌ డే’. అందాల భామ లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌ లో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా పార్టీ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘ఏదో మైకంలో తేలిపోతుంటే.. తూలిపోతుంటే’ అంటూ సాగిన ఈ సాంగ్ చాలా బాగుంది. కాల భైరవ స్వరపరిచిన ఈ పాటకు దామిని భట్ల పాడారు. కిట్టు విస్సాప్రగడ రాసిన సాహిత్యం కూడా బాగుంది.

ఇక సాంగ్ లోని ‘పోష్ పబ్’ లోపల విజువల్స్, అలాగే లావణ్య యొక్క నృత్య కదలికలు ఈ పాట స్థాయిని పెంచాయి. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ కామెడీ మూవీలో నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

పాటను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :