“ఎఫ్3” నుండి లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా సాంగ్ రిలీజ్!

Published on May 17, 2022 6:30 pm IST


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం లో పార్టీ సాంగ్ కోసం ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే స్టెప్పులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్ పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా పాటను విడుదల చేయడం జరిగింది.

ఈ పాటలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా పూజా హెగ్డే వేసిన స్టెప్పులు హైలైట్ గా ఉన్నాయి. ఈ పాటతో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో తమన్నా భాటియా, మెహ్రిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విడుదలైన పార్టీ సాంగ్ లో పూజా హెగ్డే డ్యాన్స్ అద్దిరిపోయింది అని చెప్పాలి. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కూడా ఈ పాటలో అద్భుతమైన స్టెప్పులు వేశారు.

లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా అనే టైటిల్‌గా, ఈ పాట ఒక వ్యక్తి పెద్ద కలలను కలిగి ఉండాలని మరియు జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్ మరియు గీతా మాధురి ఈ పాటను హై పిచ్ తో పాడారు. స్పైసీ సైరన్ పూజా హెగ్డే ఈ పాటలో గ్లామర్ విందును అందిస్తోంది.

వీడియో సాంగ్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :