‘పటాస్’ కన్నడ రీమేక్‌లో స్టార్ హీరో!

patas2
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నటించి, నిర్మించిన సినిమా ‘పటాస్’. రచయిత అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా జనవరి నెలలో విడుదలై అటు విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ మంచి విజయాన్ని సాధించింది. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్‌కు సూపర్ హి‍ట్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా హిట్ కాగానే ఇతర భాషల్లోకి ఈ సినిమాను రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపిన విషయం తెలిసిందే.

కన్నడలో, తమిళంలో ఈ సినిమాను నిర్మించేందుకు ఇప్పటికే పెద్ద నిర్మాతలు సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. తాజాగా కన్నడ రీమే‌కు సంబంధించిన ఆసక్తికర విషయం తెలుస్తోంది. కన్నడలో స్టార్ హీరో అయిన గణేష్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చేసేశారట. కన్నడలో యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలకు ప్రసిద్ధి గాంచిన మంజు స్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కన్నడ నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారు. జూన్ నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Exit mobile version