“పటాస్ పిల్లా” సాంగ్ విడుదల…మరోసారి మ్యాజిక్ చేసిన అనిరుధ్

Published on Jan 24, 2022 10:30 am IST


సిద్ధు, నేహా శెట్టి, పిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం డీజే టిల్లు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి పటాస్ పిల్లా పాట ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాట ను కిట్టు విస్స ప్రగడ రాయగా, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవి చందర్ పాటను పాడటం జరిగింది. ఈ పాట విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అనిరుధ్ మరోసారి తన పాట తో మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :