లేటెస్ట్ : మ్యాజికల్ మార్క్ కి చేరువలో ‘పఠాన్’ కలెక్షన్

Published on Feb 18, 2023 7:00 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ పఠాన్. షారుఖ్ ఖాన్ పవర్ఫుల్ రా ఏజెంట్ పాత్రలో కనిపించిన ఈ మూవీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ చేయగా మరొక బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం విలన్ గా కనిపించారు. హిందీ సహా పలు ఇతర భాషల్లో ఇటీవల రిలీజ్ అయిన పఠాన్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని అన్ని ఏరియాల్లో కూడా దిగ్విజయంగా విజయఢంకా మ్రోగిస్తూ దూసుకెళుతోంది.

ఓవర్సీస్ సహా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కలెక్షన్స్ తుఫాన్ సృష్టిస్తున్న పఠాన్ నేటితో వరల్డ్ వైడ్ గా రూ. 981 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. కాగా ఇందులో ఇండియా నుండే రూ. 612 కోట్లు, అలానే ఓవర్సీస్ నుండి రూ. 369 కోట్లు కొల్లగొట్టినట్లు వారు తమ పోస్ట్ లో తెలిపారు. ఇక మరొక రెండు రోజుల్లో ఈ మూవీ మ్యాజికల్ మార్క్ అయిన రూ. 1000 కోట్లను చేరుకోవడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇంకా ఈ మూవీ చాలా ప్రాంతాల్లో మంచి కలెక్షన్ తో కొనసాగుతుండడంతో రాబోయే రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డ్స్ అందుకునే అవకాశం కనపడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం :